Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం రేటు.. తులంపై ఎంత తగ్గిందంటే? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

1/7
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
2/7
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 810తగ్గింది. 22క్యారెట్ల బంగారంపై రూ.750 తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 20డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,512 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280కు పడిపోయింది.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,430 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,48,370కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,36,000 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,45,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.