×
Ad

Gold Price Today : ముదురుతున్న వార్.. వరుసగా ఐదోరోజు బంగారం, వెండి రేట్లు ఢమాల్.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold Price Today : సాధారణంగా యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి.

1/7
సాధారణంగా యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. కానీ, ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి.
2/7
గడిచిన వారం రోజులుగా బంగారం ధర పడిపోతుంది. గోల్డ్ రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ తీవ్రమవుతున్న నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/7
శుక్రవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.770 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 700 తగ్గింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో తులం బంగారంపై రూ.8,890 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 37డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,110కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,48,600 వద్దకు చేరింది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,260 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,750 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,110కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,48,600 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,63,200 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,600 వద్దకు చేరింది.
6/7
వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,85,000వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్ద కొనసాగుతుంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.