Gold and Silver Rates Today : భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. రాత్రికిరాత్రే ఢమాల్.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ తగ్గాయి.
- Harishth Thanniru
- Published On : February 6, 2026 / 11:22 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు దిగొస్తున్నాయి. రాత్రికిరాత్రే వేలల్లో వీటి ధరలు పడిపోతున్నాయి.
కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అమాంతం దిగి వస్తుండటంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాబోయే కొద్దిరోజులపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర భారీగా తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1900 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1560 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 13డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,852 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
శుక్రవారం వెండి ధర కూడా భారీగా తగ్గింది. గురువారం కిలో వెండిపై రూ. 20వేలు తగ్గగా.. ఇవాళ (శుక్రవారం) కూడా కిలో వెండిపై రూ. 20వేలు తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 40వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,39,650 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,52,350కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,39,800కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,52,500కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,39,650కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,52,350కు వద్దకు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,80,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
