Gold and Silver Rates Today : పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమయ్యారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా అదే జోరు కొనసాగిస్తోంది.
- Harishth Thanniru
- Published On : January 11, 2026 / 08:41 AM IST
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ వేళ కొత్త వస్త్రాలు, బంగారం, వెండి కొనుగోళ్లు చేస్తుంటారు. ఈ క్రమంగా బంగారం, వెండి ధరలు మధ్యతరగతి వర్గాల ప్రజలకు బిగ్ షాకిస్తున్నాయి. రోజురోజుకు వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా అదే జోరు కొనసాగిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండిపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల డిమాండ్‌కు కారణంగా కనిపిస్తోంది.
శనివారం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ (ఆదివారం) స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 56 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4509 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,28,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,40,460కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,28,900కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,40,610కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,28,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,40,460కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,75,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
