Gold and Silver Rates Today : పండుగ వేళ బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఏకంగా 15వేలు.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : పండుగ వేళ బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా రూ.15వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Published On : January 14, 2026 / 10:24 AM IST
తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగ సంబురాల్లో మునిగిపోయారు. కుటుంబం అంతా ఒకేచోటకు చేరి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మరోవైపు పండుగ వేళ మహిళలు బంగారం, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, గోల్డ్, సిల్వర్ ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి.
బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,090 పెరగ్గా, 22 క్యారట్ల బంగారంపై రూ. వెయ్యి పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 23 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,628 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 15వేలు పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 32 వేలు పెరగడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ధరలతో ప్రస్తుతం కిలో వెండి రూ.3లక్షల మార్క్ ను దాటేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,31,650 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,620కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,800కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,43,770కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,31,650 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,620కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,07,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,07,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
