Gold and Silver Rates Today : పండగ పూట మహిళలకు భారీ శుభవార్త.. రాత్రికిరాత్రే బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు
Gold and Silver Rates Today : సంక్రాంతి పండుగ వేళ మహిళలకు ఊహించని శుభవార్త వచ్చింది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటు ఒక్కసారిగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : January 15, 2026 / 10:39 AM IST
సంక్రాంతి పండుగ వేళ మహిళలకు ఊహించని శుభవార్త వచ్చింది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటు ఒక్కసారిగా తగ్గింది. రాత్రికిరాత్రే గోల్డ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై దాదాపు రూ.4వేల వరకు పెరిగింది. అయితే, తాజాగా.. బంగారం ధర తగ్గింది. దీంతో గోల్డ్ కొనుగోలుదారులు ఖుషీ అవుతున్నారు.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 820 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.750 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు బంగారం 4,594 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు.. దేశంలో వెండి ధరలు పెరిగాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.35వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,31,250 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,180కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,400కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,43,330కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,31,250 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,180కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,10,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,93,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,10,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
