Gold Silver Price Today : బంగారం భగభగలు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతో తెలుసా? ఇక కష్టమే..

Gold Silver Price Today : బంగారం ధర దూసుకెళ్తోంది. సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. సిల్వర్ ధర స్థిరంగా కొనసాగుతోంది.

1/7
Gold Silver Price Today : బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
2/7
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1040 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.950 పెరిగింది.
3/7
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ పై ఇవాళ సుమారు 35 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,401డాలర్ల వద్దకు చేరింది. ఇదే దూకుడు కొనసాగితే.. ఈ నెలాఖరు నాటికి ఔన్సు గోల్డ్ 5వేల డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,010 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,860కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు