Gold Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఒక్కరోజులో భారీ మార్పు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇవాళ గోల్డ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Updated on- August 15, 2026 / 11:04 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.710 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 650 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 25డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,375 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,200 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,280 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,130కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,200 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
