Gold Silver Price Today : బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఊహించని మార్పు.. నేడు తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్‌న్యూస్. గోల్డ్ ధరల్లో నేడు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

1/7
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, గోల్డ్ ధరలు మీకు ఊహించని షాకిచ్చాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో నేడు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.820 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరిగింది. వరుసగా మూడు రోజులు తగ్గిన గోల్డ్ రేటు.. నేడు భారీగా పెరగడం గమనార్హం.
3/7
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16 డాలర్లు తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,049 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారతదేశంలో వెండి ధర రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,330కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు