Gold-Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు బిగ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే? ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ

Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

1/7
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి షాకింగ్ న్యూస్. ఇవాళ గోల్డ్ ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
2/7
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ ధరల్లో ప్రతీరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం రేటు.. ఇవాళ (శుక్రవారం) మాత్రం భారీగా పెరిగింది.
3/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 160 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,268 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,990 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,40,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు