Gold-Silver Prices Today : పసిడి ధరల్లో ట్విస్ట్.. ఏపీ, తెలంగాణలో 22, 24 క్యారెట్ల ధరలు ఇవే!

Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ ట్విస్ట్. గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

1/7
Gold-Silver Prices Today : భారత్ లో పండుగల సీజన్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో ప్రజలు షాపింగ్ కు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోళ్లపై దృష్టిపెట్టారు. అయితే, గోల్డ్ రేట్లు రోజురోజుకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి.
2/7
దేశీయంగా బంగారం ధరల్లో అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. క్రితం రోజు ఒక్కసారిగా పెరిగిన పసిడి రేట్లు ఇవాళ కాస్త ఊరట కల్పించాయి. స్వల్పంగా దిగివచ్చాయి. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది.
3/7
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22, 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,285 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,830 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,680కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
6/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,830 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,680కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు