Gold Silver Price Today : రాఖీ పండుగ వేళ మహిళకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే?
Gold Silver Price Today : రాఖీ పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. ఇవాళ ధరలు భారీగా తగ్గాయి.
- Harish Thanniru
- Updated on- August 28, 2026 / 10:35 AM IST
రాఖీ పండుగ (రక్షాబంధన్) అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు, ప్రేమానుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ పండుగ రోజు రాఖీ కట్టిన అక్కా, చెల్లెళ్లకు సోదరులు కానుకలు సమర్పిస్తున్నారు. అధికశాతం మంది తమ సోదరులకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి రాఖీ పండుగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3160 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2900 తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన నాలుగు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4579 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర సైతం తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది. గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 15వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,59,820 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,46,500 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,870 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,820కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,500 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
