Gold-Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేటి ధరలు ఇవే..
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు నేడు భారీగా తగ్గింది.
- Harish Thanniru
- Published on- September 29, 2026 / 11:01 AM IST
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వెళ్తున్న గోల్డ్ రేటు ఇవాళ భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1370 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,128 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,800 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,400 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,950 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,080కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,650 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు
