Gold Silver Price Today : గోల్డ్ ప్రియులకు బిగ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold And Silver Rates Today : నేడు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- September 3, 2026 / 10:12 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఇవాళ భారీగా పెరిగింది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 3,333 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 3050 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై 50 డాలర్లు పెరింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,436 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి రేటు సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,350 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,500 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
