Gold Silver Price Today : బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. తగ్గుతున్న ధర.. కానీ, నిపుణుల కీలక సూచనలు

Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, సెప్టెంబర్ నెలలో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

1/6
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది. ఆదివారం కూడా బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, సెప్టెంబర్ నెలలో గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
2/6
అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలపై బంగారం ధరలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది.. సెప్టెంబర్ నెలలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
3/6
తాజాగా బంగారం ధరలను పరిశీలిస్తే.. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,58,840 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,45,050 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,390 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,200 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,240కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,050 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.