Gold Silver Price Today : మహిళలకు గుడ్‌న్యూస్.. పడిపోతున్న బంగారం ధర.. తులం ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది.
- Harish Thanniru
- Published on- August 31, 2026 / 10:17 AM IST
బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో తులం గోల్డ్ పై సుమారు రూ. 3,500పైగా తగ్గింది. అయితే, సెప్టెంబర్ నెలలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,470 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 40 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేటు 4,415 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,700 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,920 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,770కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,43,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
