Gold And Silver Price Today : బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాద్‌లో రేట్లు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ ధరలు తగ్గాయి.
- Harish Thanniru
- Updated on- September 5, 2026 / 11:25 AM IST
Gold And Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. రెండు రోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. కాగా.. ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ గోల్డ్ రేటు తగ్గగా.. వచ్చేవారం సైతం గోల్డ్ రేటు తగ్గుదల కొనసాగుతుందని.. ఈ నెల చివరి నాటికి భారీ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.1860 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1700 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఏకంగా 100 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,607 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశంలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,800 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,900 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,950 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,670కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,43,610 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
