Gold Silver Prices Today : గోల్డ్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే…
Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ (బుధవారం) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Updated on- September 9, 2026 / 10:50 AM IST
Gold Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1040 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,379 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశీయంగా వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,450 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,460 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,310కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,450 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
