Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. కుప్పకూలిన ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

1/6
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
2/6
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,370తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1,250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 11 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,800 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,350కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,200కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,350 వద్ద కొనసాగుతుంది.
5/6
ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,65,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,75,000వద్దకు చేరింది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.