Gold Rate Today : దెబ్బకు సీన్‌రివర్స్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో ఉన్నట్లుండి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published On : April 8, 2026 / 11:45 AM IST
బంగారం, వెండి ధరల్లో ఉన్నట్లుండి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న, మొన్న భారీగా తగ్గిన గోల్డ్ రేటుకు ఇవాళ మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగింది. వెండి సైతం భారీగా పెరిగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 3,950 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 3,650 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 112 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,831 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరసైతం భారీగా పెరిగింది. నిన్న భారీగా తగ్గిన వెండిరేటు.. ఇవాళ (బుధవారం) భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.10వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,820కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,970కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,820కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,000 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలో ఇవాళ భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
