Gold Rates Today : మహిళలకు మంచి గోల్డెన్ ఛాన్స్.. బంగారం ఇప్పుడు కొనడమే బెటర్.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Price Today : బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులేదు. నిన్న తగ్గిన ధరల వద్దనే ట్రేడ్ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంత ధర పలుకుతుందంటే?
- Sreehari A
- Published on- May 31, 2026 / 12:16 PM IST
Gold Price Today : బంగారం ప్రియులకు బంగారం లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.. మహిళలు గోల్డ్ కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. గత కొద్ది రోజులుగా బంగారం పెరిగినట్టు కనిపించినా మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. మే 31 (ఆదివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్న తరుణంలో పసిడి ధరలు ఎగిసిపడ్డాయి. కానీ, ఆ తర్వాత నుంచి నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో ఒకే ధర వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి.
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
చమురు ధరలు పెరగడం, డాలర్ పుంజుకోవడంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
వరుసగా 3 రోజుల నుంచి పసిడి తగ్గుతూనే వస్తుంది. మధ్యలో స్వల్పంగా పెరిగినట్టు కనిపించినా మే 30న గోల్డ్ ధరలు మళ్లీ తగ్గాయి. బంగారం కొనేవారికి ఇదే అద్భుతమై అవకాశంగా చెప్పవచ్చు.
మే 31న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల గోల్డ్ ధరలు ఎంత ట్రేడ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే :
ఏపీ, తెలంగాణలో బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 15,704గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 14,395, ఒక గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ. 11,778గా ఉంది.
అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,43,950 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, 24 క్యారెట్ల గోల్డ్ ధర స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల ధర రూ.1,57,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరల వద్ద బంగారం స్థిరంగా కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
