Gold Price Today Nov 10 : బంగారం కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. ఒక్కరోజే భారీగా పెరిగిన ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today Nov 10 : బంగారం, వెండి ధరలు ఒక్కరోజులో భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో తాజా 22, 24 క్యారెట్ల బంగారం ధరలు, కిలో వెండి ధర వివరాలివే..
- Sreehari A
- Updated on- November 10, 2026 / 07:04 AM IST
Gold Price Today Nov 10 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి భగ్గుమన్నాయి.. ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి..
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.
సోమవారం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,400 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర ఏకంగా రూ.4,000 మేర ఎగబాకింది. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం విలువైన లోహాలకు కలిసొచ్చాయి. దీంతో బంగారం, వెండి ధరలకు మార్కెట్లో మద్దతు లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే :
తాజా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,32,560గా కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. ముంబై, బెంగళూరులో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,44,610, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,560గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,760 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,710గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,550, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,580గా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఉంటాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అధికంగా కొనసాగించవచ్చు లేదా మరింత పెంచవచ్చు.
అందుకే.. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. చమురు ధరలు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి పరిణామాలు బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి. మరి రానున్న రోజుల్లో పసిడి, వెండి ధరలు ఏ దిశగా కదులుతాయో చూడాలి..
