Gold Price Today Nov 17 : పెళ్లిళ్ల సీజన్లో గోల్డెన్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Price Today Nov 17 : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. గోల్డ్ ధరలు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో నేటి 22, 24 క్యారెట్ల బంగారం ధరలు, వెండి ధర ఎంత ఉందంటే?
- Sreehari A
- Updated on- November 17, 2026 / 10:56 AM IST
Gold Price Today Nov 17 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఊరటనిచ్చే వార్త.. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు కొనుగోలుదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే, తాజాగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో నగలు కొనాలనుకునేవారికి కొంత ఊరట లభించింది.
ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు దగ్గరపడుతున్న వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు గోల్డ్ రిటర్న్స్ ప్రకారం.. ఈరోజు (మంగళవారం, నవంబర్ 17, 2026) ఉదయం 10 గంటల ప్రాంతంలో నమోదైన ఏపీ, తెలంగాణ సహా దేశీయ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి తాజా ధరలపై ఓ లుక్కేయండి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ బంగారం ధరలు ఒకే విధంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,700గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,36,040 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఢిల్లీలో పసిడి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు హైదరాబాద్‌తో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా పెరిగాయి. ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,200గా ట్రేడ్ అవుతోంది.
ముంబై, చెన్నైలో రేట్లు ఇవే :
ముంబై, చెన్నై నగరాల్లోనూ బంగారం ధరలు హైదరాబాద్‌లో ఉన్న రేట్లతో సమానంగా ఉన్నాయి. ఈ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,700 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,040గా ఉంది.
వెండి ధర ఎంతంటే? :
బంగారం ధరలతో పాటు వెండి రేట్లను కూడా కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద ట్రేడవుతోంది. వెండి కొనాలని అనుకుంటే స్థానిక మార్కెట్లో ధరలను ఓసారి చెక్ చేయండి..
కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, ఆర్థిక పరిణామాలను బట్టి మారుతుంటాయి. అంతేకాదు.. నగలు కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఆరోజు ధరను చెక్ చేసుకోండి.
