Gold silver Rate Today : బంగారం పైకి.. వెండి కిందకి.. హైదాబాద్, విజయవాడ, విశాఖలో ఈ రోజు రేట్లు ఇవే..

Gold silver Rate Today : ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన తరువాత బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు పెరగ్గా.. వెండి ధర తగ్గింది.

1/7
ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సంవత్సరం పాటు బంగారం, వెండి కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటన నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు పెరగ్గా.. వెండి రేటు తగ్గింది.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరగ్గా.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.9వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఐదు డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,690 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం కిలో వెండిపై రూ.20వేలు పెరగ్గా.. ఇవాళ (గురువారం) వెండి రేటు తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,62,000 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,48,800 వద్దకు కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,62,260కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,62,000కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,48,800 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,15,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.3,00,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,15,000 వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.