Gold silver Price Today : మోదీ దెబ్బకు బంగారం, వెండి ధరలు ఢమాల్.. ఒక్కసారిగా పడిపోయిన రేట్లు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ భారీగా తగ్గాయి.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 12:56 PM IST
బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం, వెండిని ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రకటన తరువాత రెండు రోజులు భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవాళ భారీగా తగ్గాయి.
ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి తరువాత దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో వాటి ధరలు ఇవాళ భారీగా తగ్గాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,240 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,050 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఏకంగా 83డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ పై 4,569 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే వెండిపై రూ. 15వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,60,090 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,46,750 వద్దకు కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,60,240కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,49,500 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,05,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,90,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,05,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
