Gold Rate Today : మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బుధవారం గోల్డ్, సిల్వర్ రేటు భారీగా తగ్గింది.

1/8
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. రెండు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతోంది. వెండి ధరసైతం భారీగా తగ్గింది.
2/8
పశ్చిమాసియా పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలమీద పడుతోంది. ఇరాన్ నౌకలపై అమెరికా తాజాగా దాడులు మొదలు పెట్టడంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇంకా నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
3/8
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.600 తగ్గగా.. 24 క్యారట్ల బంగారంపై రూ.550 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 24డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,486 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధర భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.5వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,58,290 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,45,100 వద్దకు చేరింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,440 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,920కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,500వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.