Gold Silver Price Today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Price Today : గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు తగ్గాయి.

1/7
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధర తగ్గింది.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 43 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,477 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పు చోటు చేసుకుంది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,110 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,100 వద్దకు చేరింది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,260 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,110కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,43,100వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.