Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతంటే?
Gold-Silver Prices Today : దసరా పండుగ వేళ బంగారం ధరలు బిగ్ షాకిచ్చాయి. సోమవారం గోల్డ్ రేటు పెరిగింది.
- Harish Thanniru
- Published on- October 19, 2026 / 10:42 AM IST
Gold-Silver Prices Today : దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ధరలు షాకిస్తున్నాయి. గత వారం భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. మళ్లీ పెరుగుతోంది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 380 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,183 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,040 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,700 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,190 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,35,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,040కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,30,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
