Gold Silver Prices Today : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు ఢమాల్..! తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
Gold Silver Prices Today : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది. అయితే, భారతదేశంలోనూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
- Harish Thanniru
- Published on- October 25, 2026 / 10:38 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు క్రమంగా పతనమవుతోంది. మరో రెండు నెలల్లో తులం బంగారం ధర రూ.లక్షకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆదివారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సఉ గోల్డ్ పై 30డాలర్లు తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,993 డాలర్ల వద్దకు చేరుకుంది. రానున్న రెండు నెలల్లో ఔన్సు గోల్డ్ 3,600 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ల గోల్డ్ రేటు భారీగా తగ్గగా.. మరోవైపు భారత దేశంలోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. మంగళవారం నుంచి వరుసగా ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంటుంది. 20 నుంచి 23 తేదీల్లో తులం గోల్డ్ పై సుమారు రూ.4వేలు తగ్గుదల చోటు చేసుకుంది. వెండి ధర కూడా తగ్గుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,580 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,730 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,580కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,20,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
