Gold Silver Prices Today : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. గోల్డ్, సిల్వర్ ధరల్లో కీలక మార్పులు.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ న్యూస్.. ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
- Harish Thanniru
- Published on- October 29, 2026 / 11:01 AM IST
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ న్యూస్. గత వారం తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు మళ్లీ క్రమంగా పెరుగుతోంది.
గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1500 వరకు పెరుగుదుల చోటు చేసుకుంది. గురువారం ధరలను పరిశీలిస్తే.. ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,043 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. చాలారోజుల తరువాత వెండి రేటు తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,100 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,32,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,950కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,950 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,15,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,15,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
