Gold-Silver Prices Today : బంగారం ధరలకు బ్రేక్.. కారణాలివే..! ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ న్యూస్. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతుంది.
- Harish Thanniru
- Updated on- October 4, 2026 / 12:40 PM IST
Gold-Silver Prices Today : బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ ధరల్లో మార్పులు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,140 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారతదేశంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,330 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
