Google Pixel 10 : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ పిక్సెల్ 10 ఫోన్‌పై ఏకంగా రూ.18వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఇలా కొన్నారంటే మీరు ఏకంగా రూ. 18వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.. ఎలాగంటే?
- Sreehari A
- Published on- June 29, 2026 / 02:56 PM IST
Google Pixel 10 : పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఫోన్ ఆఫర్.. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ లేటెస్ట్ ఆఫర్‌తో కొనుగోలుదారులు రూ. 18వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో రూ. 79,999 ధరకు లాంచ్ అయిన పిక్సెల్ 10లో 6.3-అంగుళాల డిస్‌ప్లే, గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్, 48MP ప్రైమరీ కెమెరా, అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. అలాగే, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డీల్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్.. ఈ ఆఫర్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ. 64,999కే లభిస్తోంది. రూ. 15వేలు నేరుగా ధర తగ్గింపు అందిస్తుంది. అంతేకాదు.. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. పిక్సెల్ 10లో 4,970mAh బ్యాటరీ ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ లెన్స్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా ఉంది.
గూగుల్ పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
ఈ పిక్సెల్ 10 ఫోన్ పరిశీలిస్తే.. సాఫ్ట్‌వేర్, ఫొటోగ్రఫీ, ఏఐ ఫీచర్లు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తుంది. కెమెరా పరంగా చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఛార్జింగ్ స్పీడ్ ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కన్నా కొద్దిగా తక్కువే. అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు. మంచి కెమెరా, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఈ పిక్సెల్ 10 ఫోన్ బెస్ట్ ఆప్షన్..
