Google Pixel 10 : కిర్రాక్ డిస్కౌంట్ బ్రో.. గూగుల్ పిక్సెల్ 10 అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి!
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అమెజాన్ సేల్ సందర్భంగా రూ. 67వేలకు లిస్ట్ అయింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- July 6, 2026 / 05:30 PM IST
Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. వెబ్‌సైట్ డేటా ప్రకారం.. ఈ పిక్సెల్ 10 ఫోన్ 12GB+256GB వేరియంట్ అమెజాన్‌లో రూ. 67వేలకు లిస్ట్ అయింది.
కంపెనీ ఈ ఫోన్ ముందుగా రూ. 79,999కి లాంచ్ చేయగా ఇప్పుడు నేరుగా రూ. 13వేల వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు.. రూ. 41వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ బ్రాండ్, వర్కింగ్ కండిషన్ బట్టి ఈ ఆఫర్ పొందవచ్చు.
అంతేకాదు.. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. మీరు అమెజాన్ పేతో పేమెంట్ చేస్తే.. క్యాష్ బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. కంపెనీ ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్‌తో కాంపాక్ట్ 6.3-అంగుళాల డిస్‌ప్లే అందించింది. ఇందులో కొత్త టెన్సర్ G5 చిప్‌సెట్ ప్రాసెసర్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ పిక్సెల్ ఫోన్ 4970mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 17పై ఆకట్టుకునే డీల్స్ అందిస్తోంది. రూ.82,900 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 17 మోడల్ 256GB వేరియంట్ ఇప్పుడు రూ.77,900కే లభిస్తోంది. తద్వారా రూ. 5వేలు నేరుగా తగ్గింపు పొందవచ్చు.
మీరు ఈ పిక్సెల్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ. 6,744 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డులతో రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.
