MLC Balmoori Venkat wedding reception : ఎమ్మెల్సీ బల్లూరి వెంకట్ రిసెప్షన్.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్, ప్రముఖులు.. ఫొటోలు వైరల్

MLC Balmoori Venkat wedding reception : కాంగ్రెస్ పార్టీ యువ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గడ్డం ఇందుజ రెడ్డితో ఆయన వివాహం ఏప్రిల్ 11న గోవాలో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తాజాగా వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తోపాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులు వెంకట్, ఇందుజలను ఆశీర్వదించారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8