Nalkar Priyanka : తెలుగు బిగ్ బాస్ సీజన్ 10.. ఎంట్రీ ఇస్తున్న సీరియల్ భామ..?
సీరియల్ నటి ప్రియాంక తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో ఎంట్రీ ఇస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
- Saketh U
- Published on- June 15, 2026 / 02:45 PM IST
తెలుగు బిగ్ బాస్ సీజన్ 10.. ఎంట్రీ ఇస్తున్న సీరియల్ భామ..?
తెలుగులో పలు టీవీ షోలు, సినిమాలు, సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక నల్కర్ ఆ తర్వాత తమిళ్ కి వెళ్లి అక్కడ అనేక సీరియల్స్ తో స్టార్ డమ్ తెచ్చుకుంది.
తమిళ్ లో బిజీ అయిన ప్రియాంక ఇటీవల తెలుగులో ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 10ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రియాంక నల్కర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తమిళ్ బిగ్ బాస్ లో అడిగారు. అప్పుడు వెళ్ళలేదు. తెలుగులో కూడా గతంలో అడిగారు కానీ కుదరలేదు. ఈసారి ఇంకా అడగలేదు. అడిగితే కచ్చితంగా బిగ్ బాస్ 10 కి వెళ్తాను అని తెలిపింది.
మరి ప్రియాంకనే పిలిస్తే వస్తా అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు సీజన్ 10 లో ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి.
Nalkar Priyanka
