OnePlus 9 5G : వన్‌ప్లస్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. DSLR రేంజ్ కెమెరా, జస్ట్ మీ బడ్జెట్ ధరలోనే!
OnePlus 9 5G : మీకు తక్కువ ధరలో కొత్త ఫోన్ కావాలా? వన్‌ప్లస్ 9 5జీ ఫోన్ రూ. 21వేల తక్కువ ధరకే లభిస్తోంది. 48MP కెమెరా ఫీచర్లతో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 17, 2026 / 12:41 PM IST
OnePlus 9 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అత్యంత చౌకైన ధరకే వన్‌ప్లస్ 9 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై సుమారు 40శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. వన్‌ప్లస్ 9 5జీలో 4500mAh బ్యాటరీ కూడా ఉంది.
కంపెనీ ఈ ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా అందించింది. ఈ ఫోన్‌లో DSLR రేంజ్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌పై బెస్ట్ డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 5జీపై అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 9 5జీ ధర డిస్కౌంట్ ఆఫర్ : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 9 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు రూ. 54,999 ఉండగా ప్రస్తుతం రూ. 33,999కే లభిస్తోంది. ఈ ఫోన్‌పై నేరుగా రూ. 21వేలు తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
వన్‌ప్లస్ 9 5జీ బ్యాంక్ డిస్కౌంట్ : వన్‌ప్లస్ 9 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2,175 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ రూ. 23వేల వరకు తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. తద్వారా రూ. 31,824కే పొందవచ్చు.
వన్‌ప్లస్ 9 5జీ స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 9 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ HD+ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ 9 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
వన్‌ప్లస్ 9లో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది. వన్‌ప్లస్ 9లో 48MP రియర్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ఎఫ్/2.4 అపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC,GPS ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
