Anna Lezhneva : వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన పవన్ భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
- Saketh U
- Updated on- February 3, 2026 / 08:01 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
అన్నా లెజినోవా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం ఆలయ స్నపన మండపంలో అర్చకులు మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అన్నా లెజినోవా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.