Twinkle Sharma : ఆర్ఆర్ఆర్ మూవీ చైల్డ్ ఆర్టిస్టు మల్లి.. ఇప్పుడు ఎంతగా మారిపోయిందో చూశారా?
ఆర్ఆర్ఆర్ మూవీ చైల్డ్ ఆర్టిస్టు ట్వింకిల్ శర్మ (Twinkle Sharma) గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 19, 2026 / 12:44 PM IST
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది.
ఇక ఈ చిత్రంలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది.
ఆ చిన్నారి పేరు ట్వింకిల్ శర్మ.
ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె పూర్తైయ్యే సరికి ఇంటర్ పూర్తి చేసుకుంది.
2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
. ఇక ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు పూర్తి అయ్యాయి.
తాజాగా ట్వింకిల్ శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రేంజ్‌లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
