Samsung Galaxy A07s : బడ్జెట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. జస్ట్ రూ. 16 వేలకే కొత్త శాంసంగ్ ఫోన్..!
Samsung Galaxy A07s : కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎ07ఎస్ వచ్చేసింది. 50ఎంపీ కెమెరా, 5,000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ కేవలం రూ. 16వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.
- Sreehari A
- Published on- September 8, 2026 / 03:13 PM IST
Samsung Galaxy A07s : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ A07s ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ శాంసంగ్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ-సిరీస్ చిప్‌సెట్ ఉంది.
5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఫోన్ ఎక్కువ సమయం వస్తుంది. అలాగే, ఈ గెలాక్సీ A07sలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ A07s ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర JOD 119 (సుమారు రూ.16వేలు) కాగా, 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర JOD 149 (సుమారు రూ.20వేలు)గా ఉంది. ఈ ఫోన్ జోర్డాన్‌లోని శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ లైట్ పర్పల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A07s ఫోన్‌లో 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ 16.7 మిలియన్ కలర్ ఆప్షన్లతో 6.7-అంగుళాల HD+ PLS ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐపై రన్ అవుతుంది. కంపెనీ 6 OS అప్‌గ్రేడ్‌లను కూడా అందించనున్నట్టు తెలిపింది. ఈ శాంసంగ్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G99+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 4GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A07sలో ఎఫ్/1.8 అపర్చర్ 10x డిజిటల్ జూమ్ సామర్థ్యం, 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, BeiDou, Galileo, QZSS ఉన్నాయి.
సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇతర సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. కొలతలు 167.4 మిమీ పొడవు, 77.4 మిమీ వెడల్పు, 7.6 మిమీ మందం, బరువు 188 గ్రాములు ఉంటుంది.
