Samsung Galaxy A27 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? AI ఫీచర్లతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్..!
Samsung Galaxy A27 5G Launch : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ 6 ఏళ్ల OS అప్‌డేట్‌లు, అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- June 27, 2026 / 11:35 AM IST
Samsung Galaxy A27 5G Launch : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి.. అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంది.
శాంసంగ్ ఎ సిరీస్ నుంచి వచ్చిన ఈ మోడల్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ అందుబాటులో ఉంది. గత ఏడాదిలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A26 5జీకి ఇది అప్ గ్రేడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ధర :
అమెరికాలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 349.99 డాలర్లు (దాదాపు రూ. 30,000)గా ఉంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. కానీ, శాంసంగ్ ఫోన్ లైట్ రోజ్, బ్లూ, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు పెంచుకోవచ్చు.
ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని అందిస్తుంది. ఈ 5జీ ఫోన్ కొలతలు 162.4 × 78.2 × 7.8 mm ఉండగా, బరువు సుమారుగా 200 గ్రాములు ఉంటుంది.
