Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫ్యాన్స్‌కు జాక్‌పాట్.. ప్రీమియం ఫోన్ ఇప్పుడు చీప్ రేటుకే.. రూ. 20వేలు డిస్కౌంట్..!
Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. 50MP ట్రిపుల్ కెమెరాలతో ఏకంగా రూ. 20వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 24, 2026 / 10:42 AM IST
Samsung Galaxy S24 FE : శాంసంగ్ లవర్స్ కోసం ఖతర్నాక్ డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 33శాతం తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈలో 4700mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం, ఈ ఫోన్‌పై బెస్ట్ డీల్స్ కూడా పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈపై అద్భుతమైన ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 59,999కు లాంచ్ కాగా ప్రస్తుతం రూ. 39,999కే లభిస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అత్యంత తక్కువ ధర. ఈ ఫోన్‌పై నేరుగా రూ. 20వేలు తగ్గింపు లభిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ బ్యాంక్ డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2వేలు తగ్గింపు లభిస్తుంది.
ఈ ఫోన్ రూ. 22వేల వరకు తక్కువకే సొంతం చేసుకోవచ్చు. తద్వారా అసలు ధర నుంచి రూ. 37,999కి కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇందులో 4700mAh బ్యాటరీ ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-సిమ్ 5G, LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
