Samsung Galaxy S25 FE : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..!

Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 14వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/8
శాంసంగ్ గెలాక్సీ S25 FE డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 48,355కే లభిస్తోంది. రూ. 11,644 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంది.
2/8
గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ చేసేవారికి వర్కౌట్ కాదు. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ అనేది పర్ఫార్మెన్స్, హీట్ మేనేజ్‌మెంట్ విషయంలో కొద్దిగా ఇష్యూ ఉండొచ్చు. అలాగే, ఏఐ ఫీచర్లపై ఎక్కువగా ఆధారపడే వారికి 8GB ర్యామ్ చాలా తక్కువ. గత జనరేషన్ ఫోన్లతో పోలిస్తే కెమెరా సెటప్‌లో కొత్తదనం లేదు. చెప్పుకోదగ్గ అప్‌గ్రేడ్‌లేవి లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే నార్మల్ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.
3/8
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ కొనాలా? వద్దా? : ధర, ఫీచర్ల పరంగా చూస్తే మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా గట్టి పోటీనిస్తుంది. ఇందులో గెలాక్సీ ఏఐ ఫీచర్లు, 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ పొందవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 7.4mm సన్నని డిజైన్, జెమిని లైవ్ ఇంటిగ్రేషన్‌ కూడా ఉంది. ఈ మొత్తం ప్యాకేజీ రోజువారీ వినియోగానికి ఆకర్షణీయంగా ఉంటుంది.
4/8
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP వైడ్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్,3x జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.
5/8
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్, IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. 4,900mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.
6/8
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు అదనంగా రూ. 2,417 ఆదా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
7/8
ఈ ఫోన్‌లో ప్రీమియం డిజైన్, ట్రిపుల్-కెమెరా సెటప్, అమోల్డ్ డిస్‌ప్లే, శాంసంగ్ లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ప్యాకేజీ ఉన్నాయి. ఇందులో ఎక్సినోస్ చిప్‌సెట్‌తో పాటు అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ మీరు గెలాక్సీ S25 FEని కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
8/8
Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 50వేల లోపు అద్భుతమైన ఆల్-రౌండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ డీల్‌ మీకోసమే. గత సెప్టెంబర్‌లో ప్రీమియం ఫీచర్లు, గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఇప్పుడు అమెజాన్‌లో దాదాపు రూ. 14వేలు తగ్గింపుతో లభిస్తోంది.