Suresh Raina : రాఖీ అనేది ఒక దారం మాత్రమే.. కానీ నా జీవితంలో అత్యంత అందమైన బంధం మాత్రం నువ్వే..
రాఖీ పండగ సందర్భంగా సురేష్ రైనాకు (Suresh Raina) తన సోదరి రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మా ఇంటి సంతోషంలో నువ్వు ఒక భాగం. నా ప్రతి ప్రార్థనలోనూ అల్లుకుపోయిన ఒక మధురమైన గాథవు నువ్వు. రాఖీ అనేది కేవలం ఒక దారం మాత్రమే చెల్లీ.. కానీ నా జీవితంలో అత్యంత అందమైన బంధం మాత్రం నువ్వే అంటూ రాసుకొచ్చాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 29, 2026 / 11:44 AM IST
