Suriya Jyotika : 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న సూర్య – జ్యోతిక.. పిల్లల సమక్షంలో.. ఫోటోలు వైరల్..
తమిళ్ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక ప్రేమ పెళ్లి చేసుకొని 20 ఏళ్ళు కావడంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈసారి యుకెలోని ఓ చర్చ్ లో క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. సూర్య - జ్యోతిక పిల్లలు ఇద్దరూ దగ్గరుండి ఈ పెళ్లి వేడుకను జరిపించారు. సూర్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 20 ఏళ్ళ తర్వాత సూర్య - జ్యోతిక మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఈ క్యూట్ జంట ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
- Saketh U
- Published on- September 16, 2026 / 11:05 AM IST
Suriya Jyotika Wedding Again After 20 years Marriage
