Vivo X300 Pro Deal : ఏంది భయ్యా డిస్కౌంట్.. వివోX300 ప్రోపై దిమ్మతిరిగే ఆఫర్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo X300 Pro Deal : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో X300 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 12,999 వరకు ఆదా చేయొచ్చు. పూర్తి డీల్ వివరాలివే..
- Sreehari A
- Published on- September 12, 2026 / 04:30 PM IST
Vivo X300 Pro Deal : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వివో X300 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఆకర్షణీయమైన డీల్ అందిస్తోంది. అసలు ధర రూ. 1,19,999 ఉండగా డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ 200MP టెలిఫోటో కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో రూ. 12,999 వరకు ఆదా చేయొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. వివో X300 ప్రో స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో X300 ప్రో డీల్ :
భారత మార్కెట్లో వివో ఎక్స్300 ప్రో అధికారిక ధర రూ. 1,19,999. అయితే, ఈ ఫోన్‌ను అమెజాన్‌లో తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కస్టమర్‌లు రూ. 12,999 తగ్గింపును పొందవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకున్నా ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 10వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అసలు ధర ఇంకా తగ్గాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
వివో X300 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో ఫోన్ 2800 × 1260 (1.5K+) రిజల్యూషన్ 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. HDR10+, డాల్బీ విజన్, నెట్‌ఫ్లిక్స్ HDR, SGS లో-బ్లూ లైట్ టీయూవీ రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,510mAh బ్యాటరీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో X300 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP సోనీ LYT-828 ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ JN1 లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్, OIS, ఎఫ్/2.67 అపర్చర్‌తో 200MP HPB టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో ఎక్స్300 ప్రోలో 50ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
