పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం చెలరేగింది. నర్సాపురం వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కారుపై రాళ్ల దాడి జరిగింది. దుండగులు రాళ్లు విసిరారు. జై జనసేన అంటూ
పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం చెలరేగింది. నర్సాపురం వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కారుపై రాళ్ల దాడి జరిగింది. దుండగులు రాళ్లు విసిరారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో రఘురామ కృష్ణంరాజుకి ముప్పు తప్పింది. వారు ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రాళ్ల దాడి ఘటన సంచలనంగా మారింది. మొగల్తూరు మండలం కాళీపట్నం దగ్గర ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాళీపట్నం చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాళ్ల దాడిలో కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిపై రఘురామ కృష్ణంరాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. రాళ్లు విసిరిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.