BSP Supremo: ఆర్ఎస్ఎస్‭ను సాంత్వన పరిచేందుకే పీఎఫ్ఐపై నిషేధం.. బీజేపీపై మండిపడ్డ మాయావతి

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్‌ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తులను దేశవ్యాప్తంగా జరిపిన రెయిడ్స్‌లో అరెస్టు చేశారు. సుమారు డజనుకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

Sangh policy of appeasement says Mayawati on Centre for PFI ban

BSP Supremo: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సహా దానికి అనుబంధంగా ఉన్న మరో 8 సంస్థలపై నిషేధం కేవలం ఆర్ఎస్ఎస్‭ను సాంత్వన పరిచేందుకేనని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి దుయ్యబట్టారు. సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం.. మెజారిటీ ప్రజల్ని తమ వైపుకునే ఎత్తుగడలో భాగమేనని ఆమె విమర్శించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించిన సంస్థల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు రెబర్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహబ్ ఫౌండేషన్- కేరళ ఉన్నాయి.

కాగా, ఈ విషయమై శుక్రవారం మాయావతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘పీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కేంద్రం ఎట్టకేలకు పీఎఫ్ఐతో పాటు 8 అనుబంధ సంస్థలను నిషేధించింది. ఎన్నికలకు ముందు ఈ బ్యాన్ విధించారు. రాజకీయ స్వార్థం, ఆర్ఎస్‌ఎస్‌ను స్వాంతన పరచే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఆ కారణంగానే విపక్షాలు సైతం పీఎఫ్ఐ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకారి అయితే, ఆర్ఎస్ఎస్‌ కూడా అంతేనని, దానిని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి’’ అని మాయావతి ఒక ట్వీ ట్‌లో పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్‌ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తులను దేశవ్యాప్తంగా జరిపిన రెయిడ్స్‌లో అరెస్టు చేశారు. సుమారు డజనుకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

Opposition Alliance: విపక్షాల కూటమిలో చేరేందుకు BSP ఒకే.. కాకపోతే ఒక్క షరతు!