Mayawati: దళితుల విషయంలో కులతత్వ మీడియా పద్దతి మారాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన మాయావతి
లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది
- tony bekkal
- Published On : August 28, 2023 / 05:16 PM IST
Mayawati calls Castiest Media: మీడియాపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కులతత్వ మీడియాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన ఆమె.. దళితుల విషయంలో పద్దతి మార్చుకోవాలంటూ ఆమె తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాయావతిని ఉద్దేశించి మీడియాలో ప్రధానంగా ఒకరమైన కథనాలు వస్తుంటాయి. ఆమె ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు, ఎవరికి ఆమె లాభం చేకూర్చబోతున్నారు అంటూ కథనాలు వస్తుంటాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజాగా అలాంటి కథనాలే మళ్లీ ప్రారంభం అయ్యాయి. దీన్ని పరోక్షంగా లేవనెత్తుతూనే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఆమె తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించి వారికి ఆత్మగౌరవం, ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించడానికి జీవితాన్ని అంకితం చేసిన బీఎస్పీ అధినేత పేరుతో ఆడుకోవడం అన్యాయం, బాధ్యతారాహిత్యం. కులతత్వంతో మీడియాలో ఒక వర్గం ఇలాంటి కార్యక్రమాలు చేస్తోంది.
1.मीडिया में जातिवादी मानसिकता वाले एक वर्ग द्वारा ’व्यक्ति विशेष’ कार्यक्रम में कमजोर व उपेक्षित वर्गों को उनका संवैधानिक हक दिलाकर उन्हें आत्म-सम्मान व स्वाभिमान का जीवन दिलाने के लिए अपना पूरा जीवन समर्पित करने वाली बीएसपी प्रमुख के नाम के साथ खिलवाड़ अनुचित व गैरजिम्मेदाराना।
— Mayawati (@Mayawati) August 28, 2023
ఒకరిని గుడ్డిగా కాపీ కొట్టే బదులు, ఇలాంటి మీడియా సెక్షన్‌లు వారి స్వంత విచారణ/పరిచయం తర్వాత మాత్రమే వారి జీవిత పరిచయాన్ని రాయాలి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఆమెను మాయావతి అని కాకుండా చిన్నా పెద్ద వారు కూడా గౌరవంగా బెహెన్ జీ అని సంబోధిస్తారు. కాబట్టి చంద్రావతి అని, మరింకేదో అని తప్పుడు పేరు ప్రచారం చేయడం ఖండించదగినది.
2. ऐसे मीडिया वर्ग किसी की अंधी नकल करने के बजाय खुद की पड़ताल/सम्पर्क के बाद ही जीवन परिचय लिखें, क्योंकि इनको जन्म से लेकर अब तक मायावती तथा सम्मान से सभी छोटे-बड़े बहनजी कहकर ही सम्बोधित करते हैं अर्थात् चन्द्रावती व अन्य किसी और नाम से नहीं।अतः गलत नाम प्रचारित करना निन्दनीय।
— Mayawati (@Mayawati) August 28, 2023
ఏదైనా నిర్దిష్ట వ్యక్తిత్వం గురించి ఏదైనా సమాచారం ఇచ్చే ముందు, వారు సరైన వాస్తవాలను పొందాలి. లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.
