సీక్రెట్ టూర్ : పవన్ ఢిల్లీలో ఎక్కడున్నారు, ఎవరిని కలుస్తారు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్‌ టూర్‌ సీక్రెట్‌గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం

  • Publish Date - November 16, 2019 / 06:50 AM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్‌ టూర్‌ సీక్రెట్‌గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్‌ టూర్‌ సీక్రెట్‌గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం పవన్‌ టూర్‌పై నోరు విప్పడం లేదు. పవన్‌ ఎజెండా ఏంటనే దానిపై క్లారిటీ లేదు. ప్రైవేట్‌ ప్రోగ్రామా లేక రాజకీయ పర్యటనా అన్నదీ చెప్పలేకపోతున్నారు జనసేన నేతలు.

జనసేనాని హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర పెద్దలను కలవాలని అనుకోవడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో పవన్ ఎవరిని కలుస్తారు.. ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నా.. సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న పవన్.. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.

భవననిర్మాణ కార్మికుల పరిస్థితి, అమరావతి వంటి అంశాలతో పాటు ఏపీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయంపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే పవన్ ప్రకటించారు. కాగా, ఢిల్లీ నుంచి పవన్ తిరిగి వచ్చాక ఏపీలో అనూహ్య పరిణామాలుంటాయని జనసేన వర్గాలు చెబుతున్నారు.