×
Ad

Telangana MLA Disqualification Case : పార్టీ ఫిరాయింపుల కేసులో సంచలన తీర్పు.. ఆ ఇద్దరు బీఆర్ఎస్ MLA లే

Telangana MLA Disqualification Case : పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన తీర్పు వెల్లడించారు.

Telangana MLA Disqualification Case speaker verdict about danam nagender and kadiyam srihari are brs mlas

Telangana MLA Disqualification Case : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ సంచలన తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తించడంతో వారికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. విచారణ సమయంలో దానం, కడియం ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. విచారణ సమయంలో కడియం, దానం.. తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు తెలిపారు. దీంతో స్పీకర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. “నేను కేసీఆర్‌కు జవాబుదారీగా ఉంటాను. ఇన్ని రోజులు నాపై ఫిర్యాదు చేసిన వాళ్లపై మాట్లాడలేదు. నాపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని ఇప్పుడు అడుగుతున్నాను. కొందరు వ్యక్తిగతంగా నాపై ఫిర్యాదు చేశారు.. నేను వ్యక్తిగతంగా సమాధానం ఇచ్చాను. స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. తీర్పు ఎలా ఉన్నా నాకు ఒకటే. పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆలోచనతోనే పోటీ చేశాను. నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే సిద్ధమే. పాదయాత్ర చేసి మళ్ళీ గెలుస్తాను” అని తెలిపారు.

పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పుతో.. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయల్లో  కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ బుధవారం తన నిర్ణయం ప్రకటించారు. వారిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పష్టం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో.. స్పీకర్ నేడు తీర్పు వెల్లడించారు. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా, ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు విన్న స్పీకర్.. వారికి భారీ ఊరట కలిగించారు. స్పీకర్ తీర్పు రాజకీయ వర్గాల్లో సంచలనంగా నిలిచింది.